
సాధారణంగా పెళ్లి అంటే మగ, ఆడ కలిసి చేసుకుంటారు. ఇటీవల ఇద్దరు మగాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ట్రాన్స్‌జెండర్లను కూడా వివాహం చేసుకునే వారిని కూడా చూస్తూ ఉంటాం. అయితే ఆ వ్యక్తి మాత్రం మొసలిని మనువాడాడు. అదేంటి అనుకుంటున్నారా. ఇదే నిజం. పైగా అతడో నగర మేయర్. ఇంతకీ ఆ మేయర్ ఎవరు. ఎందుకు మొసలిని పెళ్లి చేసుకున్నాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
మొసలిని పెళ్లి చేసుకున్నాడు ఓ మేయర్. తన ఊరికి మంచి జరగాలనే ఉద్దేశ్యంతో ఆ మొసలిని పరిణయమాడేందుకు సిద్ధయ్యాడు. ఆ పెళ్లి కూడా ఏదో తూతూ మంత్రంగా జరగలేదు. పెద్ద ఊరేగింపుగా ఊరు ఊరంతా ఉత్సాహంగా పాల్గొని మరీ చేశారు. ఈ వింత ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది.
టెక్నాలజీ డెవలప్ అయినా కూడా ఇప్పటికీ అనేక దేశాలలో వింత ఆచారాలు మూఢనమ్మకాలను పాటిస్తూనే ఉన్నారు. అయితే కొన్ని దేశాలలో అక్కడి ఆచారాలు సంప్రదాయాలు తెలిస్తే మాత్రం నూరేళ్లబెట్టాల్సిందే. అయితే మామూలుగా ప్రజలు వర్షాలు లేదంటే పంటలు పండడం కోసం మూగజీవాలను ఊరేగించడం లేదంటే మూగజీవాలకు పెళ్లిళ్లు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే అచ్చం అలాగే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఏకంగా మొసలిని పెళ్లి చేసుకున్నారు.
మెక్సికోలోని ఓ చిన్న పట్టణానికి చెందిన ఓ మేయర్.. ఓ మొసలిని పెళ్లి చేసుకున్న వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. అట్టహాసంగా జరిగిన ఈ వివాహ వేడుకకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై.. డ్యాన్స్‌లు చేశారు.
మెక్సికోని సాన్ పెట్రో హౌమెలులా ప్రాంతంలో చోంటల్ తెగ ప్రజలు ఎక్కువగా ఉంటారు. అక్కడి మేయర్లు.. మొసళ్లను పెళ్లి చేసుకోవడం ఆచారంగా వస్తోంది. ఇలా చేస్తే.. ప్రజలకు మంచి జరుగుతుందని, వర్షాలు బాగా పడతాయని, పంట మంచిగా వృద్ధిచెందుతుందని అక్కడి వారి నమ్మకం. ఈ క్రమంలోనే మేయర్ విక్టర్ హూగో సోసా.. అలిసియా ఏడ్రియానా అనే కైమన్ జాతికి చెందిన మొసలిని తాజాగా పెళ్లి చేసుకున్నారు.
230 ఏళ్లుగా ఈ ఆచారం
ఈ ఆచారం 230 ఏళ్లుగా వస్తోంది. స్థానికుల విశ్వాసం ప్రకారం.. నాటి చోంటల్ రాజు.. ప్రజల శ్రేయస్సు కోసం ఓ ఆడ మొసలిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుత కాలంలో.. పట్టణం మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తిని అక్కడి ప్రజలు చోంటల్ రాజుగా భావిస్తారు. అందుకే మేయర్లు మొసలిని పెళ్లి చేసుకోవడం ఆనవాయతీగా కూడా వస్తోంది. ఇలా చేస్తే.. భూమాతకు దగ్గరవుతామని, అంతా మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం.
మొసలితో వివాహం అంటే.. సాదాసీదాగా, మొక్కుబడిగా చేస్తారు అని అనుకుంటో పొరబడినట్టే! ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరుగుతుంది. స్థానికులు వధువుగా ఉన్న మొసలిని ‘ప్రిన్సెస్ గర్ల్’ అని పిలుస్తారు. మొసలిని ఇంటింటీకి తీసుకెళతారు. వారందరు మొసలిని తమ ఒడిలోకి తీసుకుని డ్యాన్స్‌లు చేస్తారు. చిన్న పిల్లలా చూసుకుంటారు. తాజాగా జరిగిన పెళ్లిలో మొసలికి గ్రీన్ రంగు స్కర్ట్ తొడిగారు. అందంగా తయారు చేసి, అలంకరించారు. ఆ తర్వాత వైట్ బ్రైడ్ కాస్ట్యూమ్ వేశారు. సమీపంలోని టౌన్ హాల్‌కు తీసుకెళ్లి, మేయర్‌తో పెళ్లి చేయించారు.
“పెళ్లి బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము. పెళ్లి బంధంలో ప్రేమ చాలా ముఖ్యం. ప్రిన్సెస్‌ను పెళ్లి చేసుకోవడం నాకు సమ్మతమే,” అని వివాహ వేడుకలో మేయర్ అన్నారు. అక్కడి వారందరు ఆనందంతో చప్పట్లు కొడుతూ.. వివాహ వేడుకలో పాల్గొన్నారు.
ఆ మొసలి ఆ తంతులో ఎవరిపైన దాడి చేయకుండా ఉండేలా దాని నోటికి తాళం వేస్తారు. ఆ తంతులో మేయర్ ఇరువురం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం కాబట్టి ఆమె బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేసి మరీ మొసలిని పరిణయమాడతాడు. ఆ తర్వాత మేయర్ ఆ మొసలితో కలిసి నృత్యం చేయడమే గాక చివరిగా దాని ముద్దాడటంతో పెళ్లి తంతు ముగుస్తుంది. స్థానిక జాలర్లు తమ మేయర్ ఇలా చేయడం కారణంగా తమ వలకు అధిక సంఖ్యలో చేపలు పడతాయని, తమ జీవితాలు మంచిగా మారతాయని ఆనందంగా చెబుతున్నారు.