FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచంలోనే ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) టోర్నమెంట్ మతిపోయే రేంజ్‌లో స్టార్ట్ అయింది. కో-హోస్ట్‌గా ఉన్న మెక్సికో తన హోమ్ గ్రౌండ్ ఎస్టాడియో అజ్టెకా (Estadio Azteca) లో ఫ్యాన్స్ ఇచ్చిన కిర్రాక్ ఎనర్జీతో బోణీ కొట్టింది. గ్రూప్-A లో జరిగిన ఉత్కంఠభరితమైన ఓపెనింగ్ మ్యాచ్‌లో మెక్సికో 2–0 తేడాతో సౌతాఫ్రికా (Bafana Bafana)పై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో గోల్స్ ఎంత హైలైట్‌గా నిలిచాయో.. ఆటగాళ్ల మధ్య జరిగిన లొల్లి, రెడ్ కార్డుల డ్రామాతో పాటు స్టేడియంలో కొందరు మెక్సికో బ్యూటీస్ అందాలు కూడా అంతే హాట్ టాపిక్‌గా మారింది.
స్టార్టింగ్ నుంచే మెక్సికో అటాక్:
మ్యాచ్ స్టార్ట్ అయిన 5 నిమిషాల నుంచే మెక్సికో ప్లేయర్లు సౌతాఫ్రికాపై ఫుల్ ప్రెజర్ పెట్టారు. స్టేడియంలో ఉన్న 80 వేల మందికి పైగా మెక్సికన్ ఫ్యాన్స్ అరుపులతో గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోయింది. మ్యాచ్ 9వ నిమిషంలోనే మెక్సికన్ ఫార్వర్డ్ జులియన్ క్వినోనెస్ (Julián Quiñones) సౌతాఫ్రికా గోల్‌కీపర్ కాళ్ల సందులో నుంచి బాల్‌ను గోల్ పోస్ట్‌లోకి పంపి అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్‌లో రాబర్టో అల్వరాడో ఇచ్చిన కిర్రాక్ క్రాస్‌ను మెక్సికో నెంబర్ 9 స్టార్ ప్లేయర్ రౌల్ జిమెనెజ్ (Raúl Jiménez) హెడర్ ద్వారా సూపర్ గోల్ చేసి టీమ్ లీడ్‌ను 2–0కి తీసుకెళ్లాడు. జిమెనెజ్‌కు తన 4వ వరల్డ్ కప్‌లో ఇదే ఫస్ట్ గోల్ కావడం విశేషం.
మూడు రెడ్ కార్డులు.. గ్రౌండ్‌లోనే గొడవ:
ఈ మ్యాచ్ వట్టి గోల్స్‌తోనే అయిపోలేదు.. ప్లేయర్ల మధ్య అగ్రెషన్ కనిపించింది. ఏకంగా 3 రెడ్ కార్డులు పడ్డాయంటే సీన్ ఎంత సీరియస్‌గా సాగిందో అర్థం చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్‌లో రౌల్ జిమెనెజ్‌ను ఫౌల్ చేసినందుకు సౌతాఫ్రికా ప్లేయర్ సిథోల్‌కు ఫస్ట్ రెడ్ కార్డ్ GDP ఇచ్చి పంపేశారు. ఆ తర్వాత సౌతాఫ్రికా సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ థెంబా జ్వానే కూడా రెడ్ కార్డ్ తీసుకున్నాడు. మ్యాచ్ చివర్లో (92వ నిమిషంలో) మెక్సికో సెంటర్-బ్యాక్ సీజర్ మోంటెస్ కూడా రెడ్ కార్డ్ లైన్ దాటడంతో గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. మొత్తానికి సౌతాఫ్రికా 9 మందితోనే మ్యాచ్ ముగించింది.
మెక్సికన్ సపోర్టర్లు చేసిన రచ్చ:
గ్రౌండ్ లో మెక్సికో ప్లేయర్లు దుమ్మురేపితే.. గ్యాలరీలో మెక్సికన్ బ్యూటీస్ చేసిన రచ్చ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు తమ అందాలని చూపిస్తూ, డాన్స్ వేయడంతో పాటు "మెక్సికో! మెక్సికో!" అంటూ ఇచ్చిన స్లోగన్స్ ఒక రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ అందాల భామలు చేసిన ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.
No one brings the energy like Mexico fans ♥️ pic.twitter.com/43nhUQBuG2
— World Cup 2026 (@ofootball__) June 11, 2026
