
అదో ప్రముఖ కంపెనీ లేటెస్టు మోడల్ కారు.భారీ అంచనాలతో ఈ ఏడాది ఇండియన్‌మార్కె ట్ లోకి దిగింది. కానీ వచ్చి ఆరు నెలలుకూడా కాకముందే కారును కొన్న ఓ కస్టమర్ ఆకంపెనీకి పెద్ద షాకిచ్చాడు. తను కొన్న కారునుఓ గాడిదతో లాగించి ఆ వీడియోను సోషల్‌మీడియాలో అప్ లోడ్ చేశాడు. కారుకు చుట్టూ‘డాంకీ వెహికల్ ’ అని బ్యానర్లు కూడా కట్టాడు. ఆవీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.క్లచ్ లో సమస్య వచ్చి..రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన విశాల్పంచోలి ఈమధ్య సదరు కంపెనీ కారునుకొన్నాడు. కారును తీసుకొని కొన్ని రోజులు కూడాకాకముందే క్లచ్‌లో సమస్యలు వచ్చాయి. దీంతోఆయన కంపెనీ షోరూంకి వెళ్లా డు. షోరూం సిబ్బందిని బాగు చేయమని అడిగాడు. వాళ్లు మాత్రం క్లచ్సమస్యను పరిష్కరించపోగా తనను బెదిరించారని వీడియోలో పంచోలి చెప్పాడు. అందుకే కోపంతో ఇలా నిరసన తెలిపానన్నాడు. అయితే పంచోలి ఆరోపణల్లో నిజం లేదని ఆ కంపెనీ చెప్పింది. ‘కారులోని సమస్యను పూర్తిగా పరిష్కరించాం. అయినా తను సంతృప్తి చెందలేదు. మేం వేరే కారి స్తామని కూడాచెప్పాం. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఇంకేంచేయాలో చెప్పండి’ అని ఆ కంపెనీ ట్వీట్ చేసింది.పైగా తమ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసేలా విశాల్‌వ్యవహరించాడని, అతనిపై చట్టపరంగా చర్యలుతీసుకుంటామని చెప్పింది.