రాజ్ భవన్ కాదు..ఇక నుంచి లోక్ భవన్

రాజ్ భవన్  కాదు..ఇక నుంచి లోక్ భవన్

తెలంగాణలోని  రాజ్ భవన్ పేరు మారింది. రాజ్ భవన్ ను లోక్ భవన్ గా పేరు మార్చారు.  అన్ని రాష్ట్రాల్లో రాజ్ భవన్ లను లోక్ భవన్ లుగా మార్చాలని కేంద్రం  ఉత్తర్వులు జారీ చేయడంతో పేరును మార్చారు.

 ప్రధాన మంత్రి కార్యాలయం భవనం పేరును కేంద్రం ప్రభుత్వం మార్చింది. దశాబ్ధాలుగా సౌత్  బ్లాక్ లో కొనసాగుతున్న ప్రధాన మంత్రి కార్యాలయాన్ని  ఆధునీకరించి దాని పేరును సేవా తీర్థ్ గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.  ఇప్పటికే గవర్నర్ల  అధికారిక నివాసం రాజ్ భవన్ ను లోక్ భవన్ గా మార్చాలని కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు పశ్చిమబెంగాల్,తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాజ్ భవన్ లను లోక్ భవన్ లుగా మార్చారు. ఇపుడు తెలంగాణ రాజ్ భవన్ పేరు మారింది.