
కేకేఆర్ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ ఔట్ వివాదాస్పదమైంది. సౌథీ వేసిన బాల్ తొలుత రోహిత్ థై ప్యాడ్‌కు తాకి కీపర్ చేతిలో పడగా అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. కోల్‌కతా క్యాచ్ కోసం రివ్యూ కోరింది. బ్యాట్‌కు, బాల్‌కు మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ.. అల్ట్రా ఎడ్జ్‌లో స్పైక్ వచ్చింది. బాల్.. బ్యాట్‌ను దాటక ముందు నుంచే స్పైక్ కనిపించినా.. థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో రోహిత్‌తో పాటు అంతా ఆశ్చర్యపోయారు.