తీరం దాటిన తర్వాత.. తుఫాన్ విధ్వంసం.. కుండపోత వర్షాలు

తీరం దాటిన తర్వాత.. తుఫాన్ విధ్వంసం.. కుండపోత వర్షాలు

తుఫాన్ మిచౌంగ్ తీరం దాటింది. బాపట్ల దగ్గర తీరాన్ని దాటింది. సముద్రం నుంచి.. తుఫాన్ భూమిపైకి వచ్చేసింది. 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల విధ్వంసంతో.. అతిపెద్ద తుఫాన్ కన్ను  తీరం దాటటంతో.. పెను విధ్వంసం సృష్టించినట్లు ప్రాథమిక సమాచారం. బాపట్ల, వేటపాలెం, చీరాల ప్రాంతాలపై తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే చెట్లు కూలిపోయాయి.. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో చాలా చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. 

తుఫాన్ మిచౌగ్.. తీరం దాటటంతో.. అతి భారీ.. కుండపోత వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. బాపట్ల, ప్రకాశం, గుంటూరు, కృష్నా జిల్లాల్లోని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బయటకు రావొద్దని వార్నింగ్ ఇచ్చారు అధికారులు. అతి భారీ వర్షాలకు వాగులు, నదులు ఉప్పొంగుతాయని.. చెరువుల కట్టలు తెగే ప్రమాదం ఉందని.. ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. 

తుఫాన్ మిచౌంగ్ తీరం దాటే సమయంలో పెను గాలులకు పంటలు దెబ్బతిన్నాయని.. రహదారులు ధ్వంసం అయ్యాయని అధికారులు వెల్లడించారు. 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విధ్వంసం చేశాయని.. వర్షాలు తగ్గిన తర్వాత నష్టం అంచనాకు వస్తుందని స్పష్టం చేశారు అధికారులు. తుఫాన్ తీరం దాటినా.. సముద్రం అల్లకల్లోలంగా ఉందని.. 50 మీటర్లు ముందుకు వచ్చిందని.. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయని.. ఎవరూ సముద్రం వైపు వెళ్లొద్దని అధికారులు ప్రకటించారు. ఏపీలోని ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, విజయనగరం, రాజమండ్రి, విశాఖపట్నం, ఏలూరు జిల్లాలకు రెడ్​అలర్ట్ జారీ అయ్యింది. మిగతా జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ కొనసాగుతుంది. తీర ప్రాంత  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

Also Read:-తుఫాన్ మిచాంగ్ : చీరాల - బాపట్ల మధ్య తీరం దాటిన తుఫాన్