ఏఐలో పెట్టుబడలు .. 3 ట్రిలియన్ల క్లబ్లో మైక్రోసాప్ట్

 ఏఐలో పెట్టుబడలు ..  3 ట్రిలియన్ల క్లబ్లో మైక్రోసాప్ట్

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్ విలువమొదటిసారిగా $3 ట్రిలియన్ల మైలురాయిని అధిగమించింది. యాపిల్ తరువాత  ప్రపంచంలోని రెండవ అత్యంత విలువైన కంపెనీగా తన స్థానాన్ని నిలుపుకుంది. మైక్రోసాఫ్ట్, యాపిల్ షేర్లు ఈ ఏడాది ప్రారంభం నుండి వాల్ స్ట్రీట్‌లో అత్యధిక క్యాపిటలైజ్డ్ స్టాక్‌గా అగ్రస్థానం కోసం పోటీపడుతున్నాయి.  యూఎస్ స్టాక్ మార్కెట్ లో మైక్రోసాఫ్ట్  షేర్ల విలువ 1.3 శాతం పెరిగి..  403.78 డాలర్లకు చేరుకుంది.    

గత ఏడాది యాపిల్‌ ఈ స్థాయిని చేరిన తొలికంపెనీగా చరిత్ర సృష్టించింది. తాజాగా యాపిల్‌ మార్కెట్‌ విలువ 3.03 ట్రిలియన్‌ డాలర్ల సమీపంలో ఉన్నది. ఓపెన్ ఏఐలో పెట్టుబడలు మైక్రోసాప్ట్ కు బూస్టు ఇచ్చాయని నిపుణుల అంచనా వేస్తున్నారు.  ఏఐలో పెట్టుబడలు మైక్రోసాప్ట్ కు షేర్లు 2023లో దాదాపు 57% లాభపడ్డాయి. బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం  మైక్రోసాఫ్ట్ 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 15 శాతం ఆదాయాన్ని పెంచుతుందని అంచనా వేయబడింది.