V-బయోనిక్‌’ సీఈవో జైన్ అహ్మద్ అరుదైన ఘనత

V-బయోనిక్‌’ సీఈవో  జైన్ అహ్మద్ అరుదైన ఘనత

హైదరాబాద్‌కు చెందిన 21ఏళ్ల ‘V- -బయోనిక్‌’ సీఈవో జైన్‌ అహ్మద్‌ సందాని.. మైక్రోసాఫ్ట్‌ 2022 ఇమాజిన్‌ కప్‌ వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ను గెలుచుకున్నారు. నరాల సమస్యలతో బాధపడేవారి కోసం ‘ఎక్సోహీల్‌’ అనే పరికరాన్ని తయారుచేసినందుకు గానూ.. జైన్, అతని బృంద సభ్యులకు ఈ ఘనత దక్కింది. న్యూరోప్లాస్టిసిటీ, అజూర్‌ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఈ గ్లవుజులు.. నాడులు దెబ్బతినడంతో చేతులను కూడా కదపలేని వారికి ఉపయోగపడతాయని, వీటి సహకారంలో త్వరగా కోలుకుంటారని వారు తెలిపారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే ఈ చికిత్సకు అయ్యే ఖర్చుతో పోలిస్తే ‘ఎక్సోహీల్‌’ పరికరం ధర చాలా తక్కువ. మార్చి 31న నిర్వహించిన తొలి దశ పోటీలో ప్రపంచస్థాయిలో 16 టీములతో పోటీపడి అర్హత సాధించిన ‘వి-బయోనిక్‌’ సంస్థ.. అనంతరం అమెరికాలోని సియాటెల్‌లో నిర్వహించిన పోటీల్లో అమెరికా, ఆసియా దేశాలకు చెందిన జట్లతో ప్రశ్నోత్తరాల పోటీలో విజయం సాధించింది.

ఈ చాంపియన్ షిప్ పాటు 50 వేల డాలర్ల అజూర్‌ క్రెడిట్స్‌తోపాటు, లక్ష డాలర్ల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నారు. వీటన్నటితోపాటు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో ఒక మెంటారింగ్‌ సెషన్‌నుస సైతం ఈ బృందం గెలుచుకుంది. ఇక జైన్‌ పుట్టింది హైదరాబాద్‌లోనే అయినా  పెరిగిందంతా సౌదీ అరేబియాలోనే. ప్రస్తుతం జర్మనీలోని జాకబ్స్‌ యూనివర్సిటీలో రోబోటిక్స్‌ అండ్‌ ఇంటెలిజెంట్‌ సిస్టమ్స్‌ చదువుతున్న  జైన్... 21 ఏళ్ల వయసులోనే రోబోటిక్స్‌పై పరిశోధనపై పట్టు సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zain Samdani (@zainnemesis)

మరిన్ని వార్తల కోసం...

సర్కార్ వారి పాట సినిమా చూస్తా

మరో వైరస్‌‌తో వణికిపోతున్న ఇరాక్