- ఒక్క రోజే రూ.43 లక్షల కోట్లు పెరిగిన మార్కెట్ విలువ
న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ ఒక్క రోజే తన మార్కెట్ విలువకు దాదాపు 450 బిలియన్ డాలర్లు (సుమారు రూ.43 లక్షల కోట్లు) పెంచుకుంది. జూన్ క్వార్టర్ ఫలితాల్లో మైక్రోసాఫ్ట్ చూపించిన అద్భుత ప్రదర్శనతో కంపెనీ షేర్లు గురువారం 9శాతం మేర పుంజుకున్నాయి.
శుక్రవారం రెండున్నర శాతం లాభంతో ట్రేడవుతుండగా, గత 5 రోజుల్లో 19 శాతం ఎగిశాయి. దీంతో సెమీకండక్టర్ కంపెనీ 'ఎన్విడియా'ను వెనక్కి నెట్టి మళ్లీ ప్రపంచంలోనే అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
