1900 మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మైక్రోసాఫ్ట్

1900 మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మైక్రోసాఫ్ట్

లేఆఫ్ అనే మాట ఇప్పుడు టెక్ కంపెనీలలో చాలా సర్వసాధారణంగా మారిపోయింది. ఉద్యోగుల తొలగింపుకు దిగ్గజ సంస్థలు వెనుకాడటంలేదు.  గతేడాది చాలా టెక్ కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలిగించింది. ఈ ఏడాది కూడా వాటని కంటిన్యూ  చేస్తున్నాయి.  ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్  వెయ్యి మంది ఉద్యోగులును తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. 

తాజగా మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్‌ను ప్రకటించింది.  గేమింగ్ డివిజ‌న్‌లో 8 శాతం ఉద్యోగులు అంటే దాదాపు 1,900 మంది ఉద్యోగుల‌పై వేటు వేసింది.   తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతోపాటు కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించే ప్రక్రియలో భాగంగా ఈ బాధాకరమైన నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో 22,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 

మైక్రోసాఫ్ట్ యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలును ఖరారు చేసిన మూడు నెలల్లోనే ఉద్యోగుల తొలగింపులు చేపట్టడం గమనార్హం. యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ గతేడాది 69 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ గతేడాది ప్రారంభంలో 10 వేల మందికిపైగా ఉద్యోగుల్ని తొలగించిన సంగతి తెలిసిందే.