బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మన్వాడలోని శ్రీ రాజరాజేశ్వర( మిడ్ మానేర్) ప్రాజెక్టుకు 8,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఎల్లంపల్లి నుంచి నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్ ల మీదుగా వరద కాలువ ద్వారా 2,400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ఎగువ కురిసిన వర్షాలతో మూల, మానేరు వాగుల ద్వారా 6,100 క్యూసెక్కుల వరద వస్తోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 27.55 టీఎంసీ లకు గాను, గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్ లో 23.791టీఎంసీల నీరు నిల్వ ఉంది.
