మిడ్ మానేర్ కు 16 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో 

మిడ్ మానేర్ కు 16 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో 

బోయినిపల్లి, వెలుగు : బోయినిపల్లి మండలం లోని మిడ్ మానేర్ ప్రాజెక్టు కు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. మూల వాగు, మానేరు వాగు, గంజి వాగుల ద్వారా ప్రాజెక్టు కు 2,525 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఎస్సారెస్పీ నుంచి 13,400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. అలాగే మిడ్ మానేర్ నుంచి నుండి ఎల్ఎండీ కి ఆరు గేట్ల ద్వారా 10,300 క్యూసెక్కులు, అన్నపూర్ణ రిజర్వాయర్ కు 6,400 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టు లో 27.54 టీఎంసీ లకు గాను 23.03 టీఎంసీ ల నీటి నిల్వ ఉంది.