మహారాష్ట్ర నుంచి వెళ్లిపోతున్న వలస కార్మికులు

మహారాష్ట్ర నుంచి వెళ్లిపోతున్న వలస కార్మికులు

మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ రావడంతో ఇప్పటికే అక్కడ నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ప్యూ అమలులో ఉంటుంది. అంతేకాకుండా.. కరోనా నిబంధనలను కూడా చాలా కఠినంగా అమలుచేస్తున్నారు. అయినా కూడా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గకపోవడంతో.. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు సొంత రాష్ట్రాల దారి పడుతున్నారు. తాజాగా గురువారం ముంబాయి నుంచి యూపీలోని గోరఖ్‌పూర్ బయలుదేరిన ట్రైన్‌లో వెళ్లిన ప్రయాణికులే అందుకు ఉదాహరణ. లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి గోరఖ్‌పూర్ బయలుదేరిన ట్రైన్‌లో వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఆ ట్రైన్‌లో నిలబడటానికి కూడా ఖాళీ లేకుండా జనాలు ఎక్కారు. కరోనా దెబ్బకు మళ్లీ వలస కార్మికులు సొంతూర్లకు వెళ్లిపోతుండటంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కాగా.. వలస కార్మికులు కూడా పని వదిలి వెళ్లిపోతూ.. తమ పరిస్థితి ఏంటో అని ఆవేదన చెందుతున్నారు.