పాలమూరు అభివృద్ధితో వలసలు వాపస్ : శ్రీనివాస్ గౌడ్

పాలమూరు అభివృద్ధితో వలసలు వాపస్ : శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: ఐటీ కారిడార్ ఏర్పాటుతో వలసలు ఆగుతాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. గురువారం మహబూబ్ నగర్ లో మాట్లాడిన ఆయన.. ఐటీ కారిడార్ తో భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందే రోజులు రాబోతున్నాయన్నారు. తెలంగాణ ఆవిర్భవంతోనే పాలమూరు అన్ని రంగాల్లో అభివృద్దిలో దూసుకుపోతోందన్న ఆయన..హైటెక్ సిటీ నమూనాలో బిల్డింగ్ నిర్మిస్తామని తెలిపారు. దశల వారిగా అభివృద్ది చేస్తామని.. పలు పథకాలతో పాలమూరు వైపు పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తామన్నారు.

అభివృద్ది, సంక్షేమ పథకాలతో పాలమూరు ప్రజల కన్నీరు తుడుస్తామని చెప్పారు శ్రీనివాస్ గౌడ్. సహజ వనరులున్నప్పటికీ పాలమూరు గత పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. పాలమూరు అభివృద్ధితో వలసలు వాపస్ రావాలన్నారు. అభివృద్దిలో ఆదర్శంగా నిలుపుతామని..కోర్టు కేసులతో పాలమూరులో అభివృద్దిని అడ్డుకోవాలని చూశారని తెలిపారు మంత్రి.