శుభాంశు యాత్ర కోట్లాది మంది కలలకు ప్రేరణ.. గగన్‌యాన్‌కు ఇది మరో మైలురాయి: ప్రధాని మోడీ

శుభాంశు యాత్ర కోట్లాది మంది కలలకు ప్రేరణ.. గగన్‌యాన్‌కు ఇది మరో మైలురాయి: ప్రధాని మోడీ

18 రోజుల అంతరిక్ష యానం ముగించుకొని భూమ్మీదకు క్షేమంగా చేరుకున్నారు ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా. జూన్ 25న అంతరిక్ష యాత్రకు బయల్దేరిన క్రూ మెంబర్లలో శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు పెగ్గీ విట్సన్, స్లావోస్ట్ డిజ్నాన్స్, టిబర్ కపు కూడా ఉన్నారు. వీళ్లు మొత్తం18 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపి.. ఇవాళ ( జులై 15 ) భూమ్మీదకు తిరిగొచ్చారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ శుభాంశు శుక్లా బృందానికి అభినందనలు తెలిపారు. శుభాంశు యాత్ర కోట్లాది మంది కలలకు ప్రేరణ అని.. గగన్‌యాన్‌కు ఇది మరో మైలురాయి అని ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు మోడీ.

భారత్‌ స్పేస్‌ మిషన్‌కు ఈ యాత్ర ఎంతో ఉపయోగకరమని అన్నారు మోడీ. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి చేరిన తొలి భారతీయుడిగా శుక్లా యాత్ర కోట్లాది మందికి కలలకు ప్రేరణ అని అన్నారు మోడీ. ఇదిలా ఉండగా.. సోమవారం ( జులై 14 ) ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరిన శుక్లా బృందం 22 గంటల ప్రయాణం తర్వాత ఇవాళ ( జులై 15 ) భూమ్మీదకు చేరుకున్నారు. శుక్లా బృందం బయలుదేరిన స్పేస్ క్రాఫ్ట్ కాలిఫోర్నియా తీరంలోని సముద్రంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది.

Also Read:-చిరునవ్వుతో బయటకు వచ్చిన శుక్లా.. డ్రాగన్ క్యాప్సూల్స్ నుంచి మెడికల్ చెకప్స్కు క్రూ టీం

శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు పెగ్గీ విట్సన్, స్లావోస్ట్ డిజ్నాన్స్, టిబర్ కపు కూడా శుభాంశు శుక్లాతో ఉన్నారు. శుభాంశు టీమ్ క్షేమంగా ల్యాండ్ అవటంతో నాసా, ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని అభినందనలు తెలపుకున్నారు. శుక్లా కుటుంబ సభ్యులు ఆనంద భాష్పాలతో భావోద్వేగానికి గురయ్యారు. 

యాక్సియం 4 మిషన్​లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు వెళ్లిన ఇండియన్ అస్ట్రొనాట్ శుభాంశు శుక్లా భూమిపై ల్యాండ్ అయిన వెంటనే 7 రోజుల క్వారంటైన్​కు తరలిస్తారు. మంగళవారం (జులై 15)  మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియాలోని కోస్టల్ ఏరియాలో శుక్లాతో పాటు మరో ముగ్గురు అస్ట్రొనాట్లు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉజ్నాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కీ-విస్నియొస్కీ, టిబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపులు ల్యాండ్ అయ్యారు.