వినయ్​భాను భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

 వినయ్​భాను భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి భౌతిక కాయం శుక్రవారం సిటీకి చేరుకుంది. రాత్రి 10 గంటల సమయంలో బేగంపేట ఎయిర్​పోర్టుకు తీసుకొచ్చారు. సైనిక గౌరవాలతో నివాళులు అర్పించారు. అక్కడి నుంచి మల్కాజిగిరిలోని ఇంటికి తరలించారు. అరుణాచల్ ప్రదేశ్‌‌లో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ గురువారం కూలిపోయింది. పశ్చిమ కమెంగ్ ​జిల్లాలోని బోమ్​డిలా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న వినయ్​భానుతోపాటు పైలట్ దుర్మరణం చెందారు. స్వస్థలమైన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం గ్రామంలో ఆదివారం వినయ్​భాను భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుపనున్నారు. – వెలుగు, హైదరాబాద్​