ద్రవ్యం విలువ తగ్గింది.. ధరలు పెరిగాయి

ద్రవ్యం విలువ తగ్గింది.. ధరలు పెరిగాయి

ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ద్రవ్యోల్బణ సమస్య ఒకటి. తర తమ బేధాలు లేకుండా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈ సమస్యను ఏదో ఒక సమయంలో ఎదుర్కుంటూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణం వివిధ దేశాల్లో వివిధ రంగాలపై, వివిధ స్థాయిల్లో అనేక ప్రభావాలను చూపిస్తూ అనేక సమస్యలకు కారణ మౌతుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం తగ్గడంతో  ఆహార పదార్ధాలు ధరలు పెరుగుతున్నాయి.   ప్రస్తుతం పాలు, గుడ్డు, చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

భారతదేశంలో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం నిలకడగా తగ్గుతూ వచ్చింది . 2023  మేలో  రెండేళ్ల కనిష్ట స్థాయి 4.25 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం తగ్గినప్పటికి  పండ్లు, కూరగాయలు , ధాన్యాల ధరలు  పెరిగాయి.   వంటకు  అవసరమైన  వస్తువులు ధరలు వినియోగదారులను భయపెడుతున్నాయి.  

పశుగ్రాసం ఖర్చులు తగ్గి  ఏప్రిల్‌లో కొంత ఉపశమనం లభించినప్పటికీ, మే నెలలో పాల ధర పెరిగింది.  దీంతో పాటు ప్రొటీన్‌కు ధర పెరిగింది. అమూల్ వంటి ప్రధాన సహకార సంస్థలు ఖర్చు తగ్గించే చర్యల కారణంగా ఈ ధరల పెంచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పాల ధరలు కొంతకాలం వరకు తగ్గే అవకాశం లేదని  అంచనా వేసింది.  ఖర్చులు తగ్గినప్పటికీ, పశుగ్రాసం ఇప్పటికీ రెండంకెల టోకు ధరల ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. 

 మే నెలలో గుడ్లు, మాంసం ,  చేపల WPIలో మూడు రెట్లు పెరిగింది, ఇది సెప్టెంబర్ 2021 తర్వాత అతిపెద్ద పెరుగుదలగా రికార్డైంది. ఇన్‌పుట్ ఖర్చులు కాకుండా, హీట్‌వేవ్స్ వంటి అంశాలు కూడా గుడ్లు వంటి నిత్యావసరాల ధరలు పెరగడానికి దోహదం చేశాయి.

ఓ పక్క ద్రవ్యోల్బణం తగ్గి ధరలు పెరిగి వినియోగదారులు ఇబ్బంది పడుతుంటే .. విపరీతమైన ఉష్ణోగ్రతలతో వేసవిలో 46 డిగ్రీల గరిష్ఠ స్థాయికి ఎండలు నమోదయ్యాయి. ఈ క్రమంలో పెరిగిన వడగాల్పులు కోళ్ల పెంపకాన్ని దెబ్బతీస్తున్నాయి. అధిక వేడికి తట్టుకోలేక కోళ్లు అధిక సంఖ్యలో చనిపోవచం పౌల్టీ రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో మాంసం రేట్లు భారీగా పెరిగాయి. దీంతో తెలంగాణలోని అనేక జిల్లాల్లో మెుత్తంగా కోళ్ల పెంపకం దాదాపు 32 శాతం పడిపోయింది. అలాగే మరణాల రేటు 14 శాతానికి చేరుకుంది. 

 దాణాకు వినియోగించే సోయా, మెుక్కజొన్న ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో మెుక్కజొన్నను సబ్సిడీపై అందించిన తెలంగాణ ప్రభుత్వం దానిని రెండేళ్లుగా నిలిపివేయటం రైతులకు భారాన్ని పెంచింది. పైగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు పెరగటం కూడా డిమాండ్ పెరుగుదలకు కారణంగా మారింది.