
చండీగడ్: ఇండియా విమెన్స్ వాలీబాల్ టీమ్ మాజీ కెప్టెన్, లెజెండరీ స్ప్రింటర్ భార్య నిర్మలా కౌర్ ఆదివారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతున్న నిర్మల.. ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో మిల్కా సింగ్.. మే 24న మొహాలీలోని ఓ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత, మే 26న నిర్మల కూడా పాజిటివ్ రిజల్ట్‌తో అదే ఆస్ప్రతిలో చేరారు. అప్పట్నించి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఆమె చివరికి ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. నిర్మల అంత్యక్రియలను కుటుంబసభ్యులు పూర్తి చేశారు.ప్రస్తుతం ఐసీయూలో ఉన్న మిల్కా సింగ్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. కాగా, మిల్కా ఆరోగ్యం నిలకడగా ఉందని, రికవర్ అవుతున్నారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.