
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న 'భోళా శంకర్' (Bhola Shankar) మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ అనే మరో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మహతి స్వర సాగర్ స్వర పరిచిన ఈ మెలోడీ గీతాన్ని సరస్వతి పుత్ర రామ జోగయ్య శాస్త్రీ రచించగా..విజయ్ ప్రకాష్, సంజన ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్ లో చిరు..తమన్నా స్టెప్స్ కు మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన ‘భోళా మానియా, జామ్ జామ్ జజ్జనక సాంగ్స్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా నుంచి వరుసగా ఇస్తున్న అప్డేట్స్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గా వస్తున్న ‘భోళా శంకర్’ చిత్రం అన్న చెల్లెళ్ల సెంటిమెంట్ తో రాబోతుంది.
ఈ సినిమాలో తమన్నా (tamanna bhatia) హీరోయిన్‌గా నటిస్తుండగా.. చిరుకు చెల్లెలు పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(keerti suresh), మరో ముఖ్య పాత్రలో హీరో సుశాంత్ కనిపిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) తెరకెక్కిస్తున్న ఈ మూవీని.. ఏకె ఎంటెర్టైన్మెంట్స్ (AK Entertinements) బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర(Rama brahmam sunkara) నిర్మిస్తుండగా.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.