
చిరంజీవి సినిమాల్లోని పాటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన కూడా సాంగ్స్‌పై స్పెషల్ ఇంటరెస్ట్ చూపిస్తారు. అలాగే ఆయన నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ‘మిల్కీ బ్యూటీ’ అంటూ సాగే మూడో పాటను రిలీజ్ చేశారు. ఇందులో చిరు, తమన్నా స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ.. క్యూట్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తున్నారు.
మహతి స్వరసాగర్ సాంగ్ కంపోజ్ చేయడంతో పాటు విజయ్ ప్రకాష్, సంజన కల్మంజేతో కలిసి పాడాడు. ‘పంచదార చిలక లాంటి ప్యారీ సుకుమారి.. నీ చమకు చూసి దుముకుతున్న చిలిపిగా నోరూరి.. వారెవ్వా అల్లరి విజిల్ ఏసి యూరేకా అన్న నిన్ను చూసి.. అంతలేసి గ్లామర్ ఏందే అందాల రాశి.. మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ’ అంటూ రామజోగయ్యశాస్త్రి క్యాచీ లిరిక్స్ రాశారు. ఫారిన్ లొకేషన్‌లో జరిగిన ఈ సాంగ్ షూట్ విజువల్స్ ఆకట్టుకున్నాయి.
మెహర్ రమేష్ డైరెక్షన్‌లో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఇందులో చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ నటించగా, సుశాంత్ కీలక పాత్ర పోషించాడు. రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖావాణి, శ్రీముఖి, రష్మీ గౌతమ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.