మిల్కీ వే ఫొటోగ్రఫీ అద్భుతాలు

మిల్కీ వే ఫొటోగ్రఫీ అద్భుతాలు

గెలాక్సీ.. కొన్ని వేల కోట్ల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాల సముదాయం. విశ్వంలో ఇలాంటి గెలాక్సీలు సుమారు 20 వేల కోట్లపైనే ఉంటాయన్నది నాసా అంచనా. మన సూర్యుడు, భూమి ఉన్న ఈ గెలాక్సీ పేరు మిల్కీ వే(పాలపుంత). దీనిలో 10 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల వరకూ నక్షత్రాలు ఉంటాయి. వీటిలో సూర్యుడి కన్నా పెద్ద నక్షత్రాలు అనేకం ఉన్నాయి. రాత్రి సమయంలో ఆకాశంలో అందంగా కనిపించే ఈ నక్షత్రాల సమూహాలను భూమిపై ఉన్న స్పెషల్ ప్లేస్‌‌లతో కలిపి చూస్తే మరింత అద్భుతంగా ఉంటుంది. ఈ అద్భుతాన్ని మిల్కీ వే ఫొటోగ్రఫీ కాంపిటీషన్ మన ముందుకు తీసుకొస్తోంది. 2021కి సంబంధించి పోటీలో 25 ఫొటోలు నామినేట్ అయ్యాయి.

12 దేశాల్లో తీసిన్రు
ఐస్ వాల్కనోలు, ఎడారులు, నదులు, జలపాతాలు, కొండలు, సముద్రతీరం, గ్లేషియర్స్.. ఇలా రకరకాల అందమైన ప్రాంతాల్లో రాత్రి వేళ మిల్కీ వే బ్యాగ్రౌండ్‌‌తో తీసిన ఫొటోలను మిల్కీ వే ఫొటోగ్రఫీ–2021కు 25 ఎంట్రీలు వచ్చాయి. ఇలా నామినేట్ అయిన 25 ఫొటోలను ఆ ఫొటోగ్రాఫర్లు ఇరాన్, స్పెయిన్, అమెరికా, గ్రీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చిలీ, టర్కీ, బ్రెలిల్, ఇటలీ, స్లొవేనియా, స్విట్జర్లాండ్ దేశాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో తీశారు. ఈ కాంపిటీషన్‌‌ను ఏటా ది అట్లాస్ అనే ట్రావెల్ ఫొటోగ్రఫీ బ్లాగింగ్ సంస్థ నిర్వహిస్తోంది. 

ఫొటో స్టోరీ, క్వాలిటీని బట్టి విన్నర్
14 దేశాలకు చెందిన ఫొటోగ్రాఫర్లు ఈ కాంపిటేషన్‌‌లో ఉన్నారు. ‘‘మిల్కీ వే ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’’ టైటిల్‌‌తో విన్నర్ ఎవరన్నది జూన్ మొదటి వారంలో  ‘ది అట్లాస్’ ప్రకటిస్తుంది. ఇమేజ్ క్వాలిటీ, ఆ ఫొటో వెనుక స్టోరీ, ఇన్‌‌స్పిరేషన్ ఏంటి అన్న విషయాల ఆధారంగానే ఎంట్రీల సెలక్షన్, విజేత ఎంపిక జరుగుతాయి. అలా ఈ కాంపిటీషన్‌‌లో ఎంట్రీ సాధించిన కొన్ని ఫొటోలివి.

చిలీలోని విలారికా అగ్ని పర్వతం వద్ద మిల్కీ వేను థామస్ స్లొవిన్‌‌స్కీ తన కెమెరాలో అందంగా బంధించాడు. దీనిని ‘వాల్కనో అండ్ క్రాస్’ అన్న కాన్సెప్ట్‌‌తో కాంపిటీషన్‌‌కు పంపాడు. ఈ ఫొటోలో కార్నర్ భాగంలో ఎర్రగా కనిపిస్తున్న నక్షత్రం పేరు కరీనా నెబులా అని, ఇది కేవలం సదరన్ హెమీస్పియర్‌‌‌‌లో మాత్రమే కనిపిస్తుందని స్లొవిన్‌‌స్కీ చెప్పాడు. 

కొండల మధ్య నక్షత్రాలు ఇంద్రధనస్సులా విరిశాయా అన్నట్టు కనిపిస్తున్న ఈ ఫొటో.. స్పానిస్ ఐలాండ్ కానరీలోని టెనెరిఫ్ ప్రాంతంలో ఉన్న టీడే వాల్కనో నేషనల్ పార్క్‌‌లో తీసినది. ‘రైజింగ్ ఫ్రం ది డస్ట్’ అనే కాన్సెప్ట్‌‌తో లోరెన్జో రనైరీ టెంటీ అనే ఫొటోగ్రాఫర్ దీనిని ‘ది అట్లాస్‌‌’కు పంపాడు.

ఇరాన్‌‌లోని పర్షియన్ గల్ఫ్ కోస్ట్‌‌ ప్రాంతంలో మహమ్మద్‌ హయాతీ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో ఇది. పగలు కొండలు తప్ప ఏమీ లేదన్నట్టు కనిపించే ఈ ప్లేస్‌‌ను ఒక ఆర్టిస్టిక్‌‌ లుక్‌‌తో ప్రెజెంట్ చేయాలన్న ఆలోచనతోనే ఈ లొకేషన్‌‌ను ఎంచుకుని, ‘నైట్ లవర్స్’ అన్న కాన్సెప్ట్‌‌తో దీనిని క్యాప్చర్ చేశానని హయాతీ చెప్పాడు.