మెదక్టౌన్, వెలుగు: ప్రభుత్వం ప్రారంభించిన ఉమీద్ పోర్టల్లో వక్ఫ్, దర్గాలు, కబ్రస్తాన్ కు సంబంధించిన ఆస్తులను నమోదుచేసుకోవాలని మెదక్ మిల్లీ అసోసియేషన్ ప్రెసిడెంట్ఉమర్ ఖాన్సూచించారు. ఆదివారం మెదక్ పట్టణంలోని ఆజంపుర వీధిలో ఉమీద్ పోర్టల్ కార్యాలయాన్ని జామా మసీద్ ఇమామ్ హఫీజ్ సయ్యద్ ఖాజా మొయిజొద్దీన్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వక్ప్ ఆస్తుల నమోదుకు ఉమీద్ పోర్టల్ ఏర్పాటుచేసిందన్నారు.
ఈ సెంటర్ ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవలందిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో మిల్లీ అసోసియేషన్ సభ్యులు సుజాత్అలీ సూఫీ, సయ్యద్ నసీర్ అహ్మద్ జౌహరీ, మిర్ జఫరుల్లా తాహీర్, మహ్మద్ రియాజుద్దీన్, సయ్యద్ సాదత్ అలీ, మహ్మద్ నదీమ్ ఖాన్, ఫాజిల్, బుర్హానొద్దీన్, జబ్బార్ అహ్మద్, నియాజీ పాల్గొన్నారు.
