సరూర్ నగర్ హత్యకు మతం రంగు పూసే ప్రయత్నం

సరూర్ నగర్ హత్యకు మతం రంగు పూసే ప్రయత్నం

సరూర్ నగర్ లో జరిగిన నాగరాజు హత్యను తీవ్రంగా ఖండించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. దారుస్సలంలో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో స్పందించిన ఒవైసీ.. అశ్రిన్ సుల్తానా తన ఇష్టపూర్వకంగానే నాగరాజును పెళ్లి చేసుకుందన్నారు. అశ్రిన్ సోదరుడు నాగరాజును హత్య చేయడం క్రూరమైన పని అని అన్నారు. రాజ్యాంగం ప్రకామైనా, ఇస్లాం ప్రకారమైనా.. ఇది నేరపూరితమైన చర్య అన్నారు. సరూర్ నగర్ హత్యకు మతం రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు అసదుద్దీన్ ఒవైసీ. హత్య కేసులో నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేశారని.. హంతకుల పక్షాన ఎంఐఎం నిలబడదని స్పష్టం చేశారు.

 

 

 

మరిన్ని వార్తల కోసం

మద్యం మత్తులో పోలీసులతో డాక్టర్ వాగ్వాదం