CAAపై శాంతి యుతంగా నిరసన చేయండి: అసదుద్దీన్ ఓవైసీ

CAAపై శాంతి యుతంగా నిరసన చేయండి: అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్: CAA, NRCలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేయాలన్నారు హైదరాబాద్ ఎంపీ, MIM చీఫ్ అసదుద్దీన్.  హైదరాబాద్ లోని దారుస్సలాంలో..  యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.  అసదుద్దీన్ ఓవైసీ  ప్రసంగిస్తూ…. నిరసన సభకు వచ్చిన వారందరికీ ధన్యవాధాలు తెలిపారు. నిరసనకారులు తమతో తీసుకువచ్చిన జాతీయ జెండాలను రోడ్డుమీద పడేయవద్దని..పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రతీ ముస్లిం ఇంటిమీద జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పారు. గాంధీ చూపిన మార్గంలో శాంతియుతంగా నిరసన తెలపాలని చెప్పారు. జాతీయ జెండాను చూసిన వెంటనే ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లకు గాంధీ అంబేద్కర్, మౌలానా ఆజాద్ లు గుర్తుకు రావాలని ఆయన అన్నారు.

CAB, NRC లకు వ్యతిరేకంగా TRS ఓటేసినందుకు సీఎం కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పారు అసదుద్దీన్ ఓవైసీ. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా బీజేపీతో దోస్తి మానుకుని తమతో కలిసిరావాలని అన్నారు. NRCపై కెరళ ప్రభుత్వం స్టే తీసుకువచ్చినట్లు తెలంగాణలో కూడా స్టే తీసుకురావాలని కేసీఆర్ ను కోరారు అసదుద్దీన్. ప్రధాని మోడీ, అమిత్ షా మత రాజకీయాలు చేస్తున్నరని అన్నారు. ఈ సభకు ఢిల్లీ జామియా ఇస్లామియా యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, HCU స్టూడెంట్ లీడర్స్ హాజరయ్యారు.