జూబ్లీహిల్స్​ మజ్లిస్​ అభ్యర్థి రషీద్ ​ఫరాజుద్దీన్

జూబ్లీహిల్స్​ మజ్లిస్​ అభ్యర్థి రషీద్ ​ఫరాజుద్దీన్
  •     ట్విట్టర్ వేదికగా ప్రకటించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
  •     బహదూర్​పురా నుంచి అక్బరుద్దీన్​కొడుకు నూరుద్దీన్ పోటీ చేసే అవకాశం

హైదరాబాద్, వెలుగు :  జూబ్లీహిల్స్​సెగ్మెంట్ నుంచి మజ్లిస్ అభ్యర్థిగా షేక్​పేట డివిజన్​ కార్పొరేటర్​రషీద్ ఫరాజుద్దీన్​ను బరిలో దింపుతున్నట్లు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్​ఒవైసీ సోమవారం ట్విట్టర్  వేదికగా ప్రకటించారు. ఈ సెగ్మెంట్​కు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్​అజారుద్దీన్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బరిలో ఉన్నారు. గ్రేటర్ పరిధిలో 9 సెగ్మెంట్ల నుంచి మజ్లిస్ పోటీ చేస్తుందని ఇటీవల అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.

ఆరుగురు అభ్యర్థులను గతంలోనే ప్రకటించగా..  తాజాగా జూబ్లీహిల్స్ నుంచి రషీద్ ఫరాజుద్దీన్ ​పేరును ఆయన ​వెల్లడించారు. అయితే, రాజేంద్రనగర్ సెగ్మెంట్ నుంచి శాస్త్రినగర్ కార్పొరేటర్ మహ్మద్ ముబీన్, బహదూర్ పురా నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ కొడుకు నూరుద్దీన్ ఒవైసీని పోటీలో నిలబెట్టే చాన్స్ ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.