బీఆర్ఎస్ మేనిఫెస్టో బాగుంది.. కేసీఆర్‌ మూడోసారి సీఎం కావడం ఖాయం : అసదుద్దీన్‌ ఒవైసీ

 బీఆర్ఎస్ మేనిఫెస్టో బాగుంది..  కేసీఆర్‌ మూడోసారి సీఎం కావడం ఖాయం : అసదుద్దీన్‌ ఒవైసీ

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోపై ఎంఐఎం ప్రశంసలు కురిపించింది.  బీఆర్ఎస్ మేనిఫెస్టో చాలా బాగుందని ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.  ఈ మేనిఫెస్టోతో కేసీఆర్‌ మూడోసారి సీఎం ఖాయమని జోస్యం చెప్పారు.  బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రూ. 400 లకే  గ్యాస్  సిలిండర్ ఇస్తామనడం మంచి నిర్ణయమని కొనియాడారు.  

అంతేకాకుండా మైనార్టీలకు బడ్జెట్ పెంచుతామనటం హర్షణీయమన్నారు.  ఎంఐఎం పోటీ చేయని చోట నేపథ్యంలోబీఆర్ఎస్ కు పూర్తి మద్దుతు ఇస్తున్నామని ఒవైసీ స్పష్టం చేశారు.  ప్రచారం కోసం రాష్ట్రానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు వస్తారని, అభివృద్ధి చూసి వాళ్ల కళ్లు తెరచుకుంటాయని విమర్శించారు.  

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లల్లో పోటీ చేయాలన్న దానిపై  తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదన్నారు. త్వరలోనే తాము కూడా అభ్యర్థులను మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లుగా అసదుద్దీన్ ఒవైసీ  వెల్లడించారు.