65 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేయడానికి మైండ్‌ట్రీ ఫౌండర్ రెడీ 

65 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేయడానికి మైండ్‌ట్రీ ఫౌండర్ రెడీ 

ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ 6 వ సెమిస్టర్‌‌ ఎగ్జామ్స్ రాయనున్న సుబ్రతో బగ్చిన్యూఢిల్లీ: మైండ్‌‌‌‌ట్రీ లాంటి పెద్ద కంపెనీని స్టార్ట్‌‌ చేసిన సుబ్రతో బగ్చి (65) తన జీవితంలో పూర్తికాని ఒక టాస్క్‌‌ను కంప్లీట్‌‌ చేయాలని నిర్ణయించుకున్నారు. డిగ్రీ డ్రాప్‌‌ అవుట్ అయిన బగ్చి, ఢిల్లీ యూనివర్సిటీ తీసుకొచ్చిన కొత్త ప్రోగ్రాం కింద తన డిగ్రీని  పూర్తి చేయాలని చూస్తున్నారు. ఢిల్లీ మందిర్ మార్గ్‌‌లోని లా సెంటర్‌‌‌‌లో 1978 లో  బగ్చి ఎన్‌‌రోల్ అయ్యారు. కానీ,  ఆ టైమ్‌‌లోనే దేశంలో ఐటీ ఇండస్ట్రీ పుంజుకుంటుండడంతో  కాలేజ్‌‌ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి జాబ్‌‌ కోసం వివిధ సిటీలు తిరగడం ప్రారంభించారు. ‘మొదట నేను కోల్‌‌కతాకు వెళ్లా. తర్వాత బెంగళూరు, ఆ తర్వాత  యూఎస్‌‌లోని  సిలికాన్ వ్యాలీకి మారా. నాకు తెలిసే లోపే  ఆరేళ్లు గడిచిపోయాయి.

ఆరో సెమిస్టర్‌‌‌‌  పూర్తి కాకుండా ఉండిపోయింది. ఎగ్జామ్స్‌‌ రాయడానికి నాకు టైమ్‌‌ లేకుండా పోయింది. దశాబ్దాలు గడిచిపోవడంతో ఈ పని పూర్తి చేయలేకపోయా. ఇది ఎలా అంటే నా ప్రయత్నాలన్నింటిని జైళ్లలో పెట్టి తాళాలు విసిరేసినట్టుగా ఉంది’ అని టైమ్స్‌‌ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బగ్చి పేర్కొన్నారు. ఇలా వివిధ కారణాలతో తమ డిగ్రీని పూర్తి చేయని వారి కోసం ఢిల్లీ యూనివర్సిటీ ఓ ప్రోగ్రామ్‌‌ను తీసుకొచ్చింది. ఇలాంటి వారు వచ్చి ఎగ్జామ్స్‌‌ రాసి తమ డిగ్రీని పూర్తి చేసుకోవడానికి అవకాశం కలిపిస్తోంది. ఏర్పాటయ్యి 100 ఏళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది మే 1 నుంచి వచ్చే ఏడాది మే 1 వరకు వివిధ ప్రోగ్రామ్‌‌లను ఢిల్లీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

ఈ యూనివర్సిటీ విడుదల చేసిన డేటా ప్రకారం, ఇలా ఎగ్జామ్స్‌‌ రాసి డిగ్రీ పూర్తి చేయడానికి 8,500 మంది క్యాండిడేట్లు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఐదు సెమిస్టర్లు పూర్తి చేసి, ఆరో సెమిస్టర్‌‌‌‌ను పూర్తి చేయలేకపోయాననే ఆలోచన తనను ఎప్పుడూ వెంటాడుతుండేదని బగ్చి అన్నారు. ఈ ఆరో సెమిస్టర్‌‌‌‌ను పూర్తి చేయడానికి తనకు గైడెన్స్ ఇస్తున్న 28 ఏళ్ల టీచర్‌‌‌‌ గురించి ఆయన ట్విటర్‌‌‌‌లో పేర్కొన్నారు.