బైబై.. ఎర్త్.. ఛలో చందమామ

బైబై.. ఎర్త్.. ఛలో చందమామ

చంద్రుడిపై పరిశోధనలతో ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రునిపై మానవజీవనం సాధ్యమయ్యే అవకాశాలకు ప్రాణం పోసింది. ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న తరుణంలో చంద్రుడిపై జీవనంపై గురించి ఊహలకు ఇస్రో పరిశోధనలు  బలపరుస్తున్నాయి. ఇస్రో పరిశోధనలతో చంద్రునిపై ఆక్సిజన్ దాగి ఉన్నట్లు ప్రజ్టాన్ రోవర్ గుర్తించడం చందమామపై మనుషులు జీవించడం సాధ్యం కావొచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. చంద్రుడిపై ఆక్సిజన్ జాడలను గనక మానవ జీవనానికి అనుకూలంగా మళ్లించగలిగితే మనుషుల జీవనం సాధ్యమేనని శాస్త్రవేత్తలు అంచానా వేస్తున్నారు. 

దశాబ్దాలుగా చందమామపై నివాసానికి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు చంద్రుడు నివాస యోగ్యమేనా అనే దానిపై అనేక పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయినా చందమామపై ఎవరికి పట్టు దొరకలేదు... చంద్రాయన్ 3 మిషన్ ద్వారా  చంద్రునిపై పరిశోధనలపై దృష్టి పెట్టిన ఇస్రో.. తన ప్రయత్నాల్లో దాదాపుగా విజయం సాధించింది. తాజాగా చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేస్తున్న రోవర్.. అక్కడ ఆక్సిజన్, సల్ఫర్ సహా అనేక ఖనిజాల జాడను కనిపెట్టింది. శిలల రూపంలొ ఉన్న వీటిని గనక మానవ మనుగడ అనుకూలంగా మార్చగలిగితే చంద్రునిపై మనుషులు జీవించడం అసాధ్యమేమీ కాదంటున్నారు శాస్త్రవేత్తలు...