నస్పూర్, వెలుగు: మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐ సెంటర్ లో ఈ నెల 23న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాలలోని మహేంద్ర ఆటోమోటివ్ మ్యానుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 40 ఖాళీలు ఉన్నాయని, వాటిల్లో టెక్నికల్ అసిస్టెంట్ 32, సూపర్వైజర్ 1, అడ్వైజర్ 2, ఎగ్జిక్యూటివ్ 5 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఐటీఐ/డిప్లొమా/బీటెక్/ఏదైనా డిగ్రీ అభ్యర్థులు అర్హులని, పూర్తి వివరాలకు 7093975333, 8333059029, 91103668501 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.
