పత్తికి మద్దతు ధర పెంచాలె : డీసీసీ అధ్యక్షుడు డా. వంశీకృష్ణ

పత్తికి మద్దతు ధర పెంచాలె : డీసీసీ అధ్యక్షుడు డా. వంశీకృష్ణ
  • నాగర్​కర్నూల్​ డీసీసీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ 
  • అచ్చంపేటలో రోడ్డుపై పత్తిని కాల్చి నిరసన 

అచ్చంపేట, వెలుగు:  రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర సర్కారు అన్నదాతల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని నాగర్​ కర్నూల్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్​ వంశీకృష్ణ ఆరోపించారు. పత్తి రైతుకు మద్దతు ధరను పెంచాలని, సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్​ఆధ్వర్యంలో అచ్చంపేటలోని అంబేద్కర్​ చౌరస్తా వద్ద రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పత్తి రోడ్డుపై వేసి కాలవెట్టి రెండు గంటల పాటు రాస్తా రోకో చేశారు.

వంశీ కృష్ణ మాట్లాడుతూ అధిక వర్షపాతంతో ఈసారి పంట దిగుబడి అంతంత మాత్రమే వచ్చిందని, దీంతో పెట్టుబడులు సైతం ఎల్లక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నాయన్నారు. రోజు రోజుకు పత్తి ధర తగ్గుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. కాంగ్రెస్​ లీడర్లు గోపాల్​రెడ్డి, అనంతరెడ్డి, వెంకట్​ రెడ్డి, రామనాథం, పదిర జంగయ్య, సుధాకర్​గౌడ్​, సలేశ్వరం, కృష్ణ రెడ్డి, నసీర్​, వెంకట్​ రెడ్డి, యాదగిరి, అల్వాల్​ రెడ్డి, సజ్జు పాల్గొన్నారు.