
నస్పూర్, వెలుగు: ప్రమాద రహిత సింగరేణి దిశగా ఉద్యోగులు ముందుకు సాగాలని మైనింగ్ డీఎంఎస్ఎన్.నాగేశ్వర్ రావు సూచించారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్ తో కలిసి ఏరియాలోని ఆర్కే5 గనిని తనిఖీ చేశారు. గనిలో తీసుకుంటున్న రక్షణ చర్యల గురించి అధికారులతో మాట్లాడారు. గనిలోని 4 సీమ్ పని స్థలాలను ప్రత్యక్షంగా పరిశీలించి, తీసుకుంటున్న రక్షణ చర్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఒక్క ఉద్యోగి తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించాలని, రక్షణ సూత్రాలు పాటించాలని సూచించారు. ఆర్కే5, ఆర్కే 6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, ఆర్కే5 గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝా, గని ఇన్చార్జి రక్షణాధికారి రాందాసు, సర్వే అధికారి సంపత్, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.