ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతాం

V6 Velugu Posted on Jun 05, 2021

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పదవ తరగతి, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతామ‌న్నారు ఆ రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు రాద్ధాంతం చేస్తున్నాయ‌ని.. ప్ర‌తిప‌క్షాలు చేసే ఆందోళ‌న‌ల‌ను తాము ప‌ట్టించుకోబోమన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.  ఇవాళ రాజమండ్రిలో ఒక స‌మావేశంలో పాల్గొన్న‌సంద‌ర్భంలో ఈ వ్యాఖ్య‌లు చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.

కరోనా కారణంగా 10, ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ వస్తున్నామని..క‌రోనా త‌గ్గిన తర్వాత ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. త‌ల్లిదండ్రులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని కోరుకుంటున్నారని, ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని వారు చెప్ప‌డం లేద‌న్నారు. ప్ర‌తిప‌క్షాలు చేసే ఆందోళ‌న‌ల‌ను ప‌ట్టించుకోమ‌ని..విధ్యార్ధుల భ‌విష్య‌తే త‌మ‌కు ముఖ్య‌మ‌న్నారు. ప‌రీక్ష‌ల‌ను ఎప్పుడు నిర్వ‌హించేది త్వ‌ర‌లో తెలుపుతామ‌ని మంత్రి తెలిపారు.

 

Tagged inter exams, minister Adimulapu Suresh, conducted, 10th

Latest Videos

Subscribe Now

More News