- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ సంతాప సభను ఆయన గౌరవానికి తగ్గట్టుగా, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా నిర్వహిద్దామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మంత్రి నివాసంలో కవులు, కళాకారులు, దళిత సంఘాలు, ప్రజా సంస్థలు, ఉద్యోగ సంఘాలతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడారు. అందెశ్రీ అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం రేవంత్ ప్రవర్తించిన తీరు కవులు, కళాకారులకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవానికి నిదర్శనంగా నిలిచిందని తెలిపారు. అందెశ్రీ రచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని మంత్రి చెప్పారు.
