- కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, వెలుగు: రైతుల అకౌంట్లో 48 గంటల్లో ధాన్యం డబ్బులు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి తేమ శాతంను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో సీరియల్ రిజిస్టర్ ను తనిఖీ చేసి తేమ శాతం 17 వచ్చిన ధాన్యం సీరియల్ ప్రకారం ధాన్యం కాంటా వేసి మిల్లులకు తరలించాలన్నారు.
సరైన తేమ శాతం వచ్చినా ధాన్యం కాంటా విషయంలో జాప్యం చేస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసుకొని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. డీఎస్ఓ మోహన్ బాబు, డీఎం రాము, తహసీల్దార్ కృష్ణయ్య, ఏఓ సందీప్, ఏఈఓలు, ఏపియం తదితరులు పాల్గొన్నారు.
