భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో బీఎడ్ కాలేజీలో టీచర్లకు ట్రైనింగ్

భద్రాచలం  ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో  బీఎడ్ కాలేజీలో  టీచర్లకు ట్రైనింగ్

భద్రాచలం, వెలుగు :  ట్రైబల్​ వెల్ఫేర్ శాఖలో పనిచేస్తున్న టీచర్లకు బీఎడ్​ కాలేజీలో సోమవారం స్పెషల్​ ట్రైనింగ్​ను డీడీ అశోక్​ ప్రారంభించారు. సబ్జెక్టు బోధన సామర్థ్యాలు పెంచేందుకు ఈ ట్రైనింగ్​ దోహదపడుతుందని డీడీ అశోక్​ పేర్కొన్నారు. హెచ్​ఎంలు, టీచర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

ఐదు రోజుల పాటు ఈ ట్రైనింగ్​జరుగుతుందని ఆయన చెప్పారు. హిందీ. ఇంగ్లీషు, తెలుగు భాషల్లో నిర్వహిస్తున్న ఈ ట్రైనింగ్​కు 180 మంది టీచర్లు, 12 మంది డీఆర్​పీలు హాజరయ్యారు.