- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్రంలో పేదవారికి పక్కా ఇల్లు కట్టిండమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసమే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చేపట్టామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని ఐదో వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు కళావతి రమేష్ దంపతుల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీర్ల ఫౌండేషన్ నుండి లబ్ధిదారులకు పట్టుబట్టలు పెట్టి యాటపోతును కానుకగా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. మొదటి విడతలో భాగంగా ఆలేరు నియోజకవర్గంలో 3700 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, ఇండ్ల నిర్మాణాల్లో ఆలేరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు. బీర్ల ఫౌండేషన్ చైర్ పర్సన్ బీర్ల అనిత, మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, తహసీల్దార్ గణేష్ నాయక్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు భిక్షపతి ఉన్నారు.
రాజపేట, వెలుగు: ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. బొందుగుల చెరువులో చేప పిల్లలను వదిలారు.
