ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్ : ఎస్పీ శరత్ చంద్ర పవార్

ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్ : ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ అర్బన్, వెలుగు: ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. సోమవారం నల్గొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 28 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.  

సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలని ఆదేశించారు.  పోలీస్ స్టేషన్ కి వచ్చిన  ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్టపరంగా బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.