గురుకులాలపై హరీశ్ రావు రాజకీయం చేస్తున్నరు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

గురుకులాలపై హరీశ్ రావు రాజకీయం చేస్తున్నరు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకులాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు రాజకీయం చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలోని ఏ హాస్టల్ కైనా వెళ్తాం పదా.. ఏ హాస్టల్​లో పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది’’అని ఆయన సవాల్ విసిరారు. సోమవారం సాయంత్రం సీఎల్పీలో మీడియాతో అడ్లూరి మాట్లాడారు. దళిత, బీసీ పిల్లలు చదువుకునే హాస్టళ్లపై రాజ కీయం చేయడం హరీశ్ రావుకు తగదన్నారు.

పదేండ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్.. ఏనాడు గురుకులాలను పట్టించుకోలేదని, గతం మరిచి ఇప్పుడు హరీశ్ ​రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిం చారు. కుటుంబ తగాదాలతో హరీశ్​రావు ఏవేవో మాట్లాడుతున్నారని, ఆయనకు దమ్ముంటే కవిత ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.