తమ్ముడూ పవన్ అంటూ ప్రేమగా పిలిచిన మంత్రి అంబటి.. ట్వీట్ వైరల్..

తమ్ముడూ పవన్ అంటూ ప్రేమగా పిలిచిన మంత్రి అంబటి.. ట్వీట్ వైరల్..

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. జనసేన టీడీపీ పొత్తు పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేయడంతో ఆ ఎన్నికల వేడి మరింత పెరిగింది. పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు రెండు సీట్లలో అభ్యర్థులను ప్రకటించడాన్ని పవన్ తప్పు పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ రెండు సీట్లలో అభ్యర్థులను ప్రకటించారు.

 రాజోలు, రాజానగరం నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలోనే కాకుండా అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది. దీనిపై వైసీపీ నేత మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ గా ఎక్స్ లో ట్వీట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్  పొత్తు ధర్మం వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పొత్తు ధర్మమంటే ఇదే తెలుసుకో తమ్ముడూ అంటూ పవణ్ ను అంబటి అన్నారు.

 చంద్రబాబు పొత్తు ధర్మం ఇలాగే ఉంటుందని చెప్పారు. ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ కు సూచించారు. మంత్రి అంబటి, పవన్ కళ్యాణ్ ను తమ్ముడూ అన్న పిలుపు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.