
కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం, కరెంటని అన్నారు డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో మంత్రి పొంగులేటితో కలిసి నాగార్జున సాగర్ రెండో జోన్ కి నీటిని విడుదల చేశారు .
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన భట్టి .. బీఆర్ఎస్ వల్లే నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణ, గోదావరి పైన రావాల్సిన వాటా గురించి దృష్టి సారించింది. శ్రీశైలం డ్యామ్ పైన ఉన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వల్ల ఖమ్మం, నల్గొండ జిల్లా రైతులకు ఇబ్బందిగా ఉంటుందని గతంలో ప్రజెంటేషన్ ఇచ్చాం. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు ఒక టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం రాయలసీమ వద్ద ప్రాజెక్టు కట్టుకుంటుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు.
బీఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారాలని ప్రజలు గమనించాలి. తెలంగాణాలో ఉన్న కోయిల్ సాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. కృష్ణా జలాలను వీలైనంత వరకు తెలంగాణాకు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంది. యుద్ద ప్రాతిపదికన పాలేరు వద్ద ఎడమకాలువ పనులు పూర్తి చేశారు. రైతులు పండిచడానికి పంటకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇచ్చాము. రైతులకు ఇన్సూరెన్స్ కల్పించాం. రైతులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం ముందుకు పొంతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆహార ధాన్యాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. 65 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని అన్నారు .