- మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి టౌన్, వెలుగు: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటివని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ..పేద, మధ్యతరగతి మహిళల జీవితాల్లో ఈ పథకం వెలుగులు నింపుతుందన్నారు. ప్రతీ లబ్ధిదారుడి దగ్గరికి ప్రభుత్వ పథకాలు చేరేలా అధికారులు, నాయకులు పనిచేయాలని సూచించారు.
అనంతరం సంగారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 341 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీజీఐఐసీ చైర్పర్సన్నిర్మల జగ్గారెడ్డి తో కలిసి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ చంద్ర శేఖర్, ఆర్డీవో రాజేందర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అక్షయపాత్ర కృషి అభినందనీయం
వేలాది మందికి ఆహారం అందిస్తున్న అక్షయపాత్ర కృషి అభినందనీయమని మంత్రి దామోదర, టీజీఐఐసీ చైర్పర్సన్నిర్మల జగ్గారెడ్డి అన్నారు. కంది మండలంలో హరే కృష్ణ అధ్వర్యంలో నిర్వహించిన మహా నరసింహ హోమం, గర్భాలయ యంత్ర స్థాపన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్షయపాత్ర ఆధ్వర్యంలో 3 కొత్త ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అక్షయ పాత్ర ఫౌండేషన్ అతిపెద్ద కిచెన్ ను పరిశీలించారు. .
