పంజాగుట్ట, వెలుగు: హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న దివంగత గద్దర్ సతీమణి విమల, ప్రజా కళాకారుడు జయరాజ్‌ను హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ శనివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పను ఆదేశించారు. పరామర్శ అనంతరం.. మంత్రి దామోదర నిమ్స్‌లోని ఓపీ బ్లాక్‌లో ఆకస్మిక తనిఖీ చేశారు.
అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను, ఫార్మసీ, శాంపిల్ కలెక్షన్ ల్యాబ్‌లను నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. హాస్పిటల్‌కు వచ్చిన పేషెంట్లను మంత్రి పలకరించారు. హాస్పిటల్‌లో అందిస్తున్న సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్‌లో పేషెంట్లకు, రోగులకు మెరుగైన వైద్య సదుపాయాల, సేవల కల్పనపై నిమ్స్ డైరెక్టర్‌కు పలు సూచనలు చేశారు.
