రెండు రోజులు నన్ను వదిలేయండి.. సన్నిహితులతో ఈటల!

రెండు రోజులు నన్ను వదిలేయండి.. సన్నిహితులతో ఈటల!

రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ను పెద్దసంఖ్యలో నాయకులు, ప్రజాసంఘాల నేతలు కలిశారు. నాయకుల రాకతో… హైదరాబాద్ షామీర్ పేట్ లోని ఈటల రాజేందర్ ఇల్లు సందడిగా కనిపించింది. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ .. ఉదయం ఈటల ఇంటికి వెళ్లి కలిశారు. బీసీ సంఘాల నాయకులు కూడా రాజేందర్ ను కలిసి మాట్లాడారు. హుజురాబాద్ సభలో మంత్రి ఈటల చేసిన కామెంట్స్ కు నాయకులు సంఘీభావం తెలిపినట్టు సమాచారం.

తనను కలిసి నాయకులు, అభిమానులతో ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ఇష్టాగోష్టిగా మాట్లాడినట్టు సమాచారం. “నాకు అక్రమ ఆస్తులు లేవు. నేను రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారాల్లో ఉన్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించాలని డబ్బులు పంపారు… ఎవరు పంపారో నాకు అర్థం కాలేదు. అప్పుడు ఎన్నికల ప్రచారంలో ధర్మాన్ని గెలిపించాలి అని ప్రజలను కోరాను. ఈసీ చేత దాడులు కూడా చేయించారు. నేను సీఎంని కలవాలని ఇంకా ఏం అనుకోలేదు. రెండు మూడు రోజులు నన్ను వదిలేయండి. నేను ఇప్పుడు ఎటువంటి ప్రకటనలు చెయ్యను. మౌనంగానే ఉంటా” అని వారితో ఈటల రాజేందర్ చెప్పినట్టు తెలిసింది.