మినిమం వేజ్ యాక్ట్ అమలు చేయాలె

మినిమం వేజ్ యాక్ట్ అమలు చేయాలె

కరీంనగర్: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అనేక రంగాల్లో 8 గంటలకు బదులుగా 12 గంటల పని విధానం కొనసాగుతోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మేడే సందర్భందగా ఆయన కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రైవేట్ సెక్టార్ లో శ్రమ దోపిడీ కారణంగా కొందరి జీవితాలు దుర్భరంగా మారాయని ఈటల అన్నారు. మినిమం వేజ్ యాక్ట్ అమలుచేయాలని డిమాండ్ చేశారు.

దేశంలో పంటలు వేయొద్దని శాసించిన సీఎం కేసీఆర్ తప్ప ఎవరూ లేరని ఈటల విమర్శించారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు అందిస్తున్నానన్న ముఖ్యమంత్రి ఇప్పుడు పంట కొనడానికి రాద్దాంతం చేస్తున్నాడని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించకపోవడంతో రైతులు ప్రైవేటులో అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని ఈటల మండిపడ్డారు. ఒక చేతితో రైతుబంధు ఇచ్చి మరో చేతితో దోచుకుంటున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెల్లిందని అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు బావులు, బోరు నీళ్లు తాగుతున్నారని విమర్శించారు. 

యాదగిరిగుట్ట ఆలయం పునర్నిర్మాణంలో వందల మంది జీవితాలు చిధ్రం చేశారని ఈటల ఆరోపించారు. పార్కింగ్ పేరుతో గంటకు రూ.500 వసూలు చేస్తూ దేవుడి పేరుతో వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. గుట్టపైకి రాకుండా మీడియాను నిషేధించడాన్ని ఈటల తప్పుబట్టారు. కేసీఆర్ సర్కారు పోతేనే పరిస్థితి బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. నష్టాల పేరుతో ఆర్టీసీని మూసేసే ప్రయత్నం చేస్తే  పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తల కోసం..

మేడే వేడుకల్లో పాల్గొన్న మంత్రి గంగుల 

కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేసిండు