అధికారులపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

 అధికారులపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

ఏటూరు నాగారం మండల పంచాయతీ అధికారులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ఆయన ఇవాళ ములుగు జిల్లాలో ఆకస్మిక పర్యటన చేశారు. ఇందులో భాగంగా ఏటూరునాగారంలోని పలు ప్రాంతాల్లో తిరిగి పరిశీలించారు. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని అని అధికారులపై మండిపడ్డారు. పారిశుద్ధ్య పనుల జరగడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, సంబంధిత అధికారులకు మంత్రి చివాట్లు పెట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అనంతరం ఏటూరు నాగారంలో రోడ్లు, సైడ్ డ్రెయిన్స్ నిర్మాణం కోసం మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక నిధులు కేటాయించారు.