కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత మోడీకి లేదు

కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత మోడీకి లేదు

హైదరాబాద్: కేసీఆర్ది కుటుంబ పాలన కాదని... ప్రజా పాలన అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని ఇవాళ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం క్రియాశీలంగా వ్యవహరించిందనే విషయాన్ని మరవొద్దని చెప్పారు. మతం పేరుతో రాజకీయం చేసే మోడీకి  కేసీఆర్ గురించి మాట్లాడే అర్హతలేదని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. నల్ల చట్టాలు తీసుకొచ్చి దేశంలోని రైతుల ఉసురు తీసింది మోడీ కాదా అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం అంబానీ, ఆదానీ కోసమే పనిచేస్తోందన్న ఆయన... పేద ప్రజల కోసం మోడీ ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

అద్వానీ, జోషి లాంటి వాళ్ళ‌ని తొక్కి పైకి వ‌చ్చిన మోడీ తెలంగాణ ప‌ట్ల వివ‌క్ష‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు. మోడీకి కుటుంబం లేద‌ని, అందువ‌ల్ల ఆయ‌న‌కు సెంటిమెంట్లు తెలియ‌వ‌న్నారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ది పథంలో నడుస్తోందని, ఇవాళ తమ పథకాలను బీజేపీతో సహా ప్రతి ఒక్కరూ కాపీ కొడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని మోడీ అంటున్నారని, అసలు రాష్ట్రానికి ఆయన ఏం చేశారో చెప్పాలన్నారు. 155 మెడికల్ కాలేజీల్లో ఒక్కటైనా రాష్ట్రానికి ఇచ్చారా అని ప్రశ్నించారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి... మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

దృష్టి మరల్చేందుకే కేంద్రంపై విమర్శలు

కేంద్రంలో మార్పు తథ్యం