రెమ్ డెసివిర్ దందా: ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోలేం

రెమ్ డెసివిర్ దందా: ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోలేం

రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువ కాలేదని...కొద్ది రోజులుగా నమోదైనట్లుగా ఇప్పుడు కేసులు అంతగా లేవన్నారు.అయితే ఆస్పత్రులకు వస్తున్న వారికి మెరుగైన సౌకర్యలు కల్పించేందుకే ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి ఈటల రాజేందర్. వీ6 స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన..ప్రతీ ఒక్కరినీ రక్షించుకునేందుకు చర్యలు చేపడుతామన్నారు. వైరస్ తగ్గే అవకాశముందన్నారు. ఆయితే కార్పొరేట్ ఆస్పత్రుల్లో  బెడ్ల కొరత ఉందన్నారు. దీనికి ఇతర రాష్ట్రాలనుంచి మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడమే కారణమన్నారు. జిల్లా ఆస్పత్రులకు కోవిడ్ పేషంట్లను చేర్చుకునేందుకు పర్మిషన్ ఇచ్చామని అయితే..పేషంట్లు కొంత కోలుకోగానే అక్కడి డాక్టర్లు  గాంధీ ఆస్ప్తత్రికి పంపుతున్నారని..దీంతో గాంధీలో బెడ్ల కొతర తో పాటు ఆక్సిజన్ కొరత  ఏర్పడుతోందన్నారు. అక్కడే చికిత్స ఇవ్వాలని స్థానిక డాక్టర్లను కోరామన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవనడం సరైంది కాదన్నారు. ప్రజాప్రతినిధులు నిమ్స్,టిమ్స్ లాంటి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నారని..వాటిలో మెరుగైన ఫెసిలిటీస్ ఉన్నాయన్నారు. ఎంతో మంది సీరియస్ పేషంట్లకు ట్రీట్మెమెంట్ చేసి వారిని బతికించాయన్నారు. గాంధీలో కూడా మంచి సౌకర్యాలున్నాయన్నారు. త్వరలోనే కరోనా వైరస్ కట్టడికి ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. 

గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు మంత్రి ఈటల. ఇప్పటి వరకు కరోనాను అంతం చేసే మెడిసిన్ ను ఎవరూ కనుగొనలేదని..అందరూ అంచనా వేస్తూ చెబుతున్నవేనని అన్నారు. ప్రజలను కాపాడుకోవడానికి వారిలో ధైర్యాన్ని నింపాల్సిన భాద్యత మంత్రిగా తనపై ఉందన్నారు. ప్రస్తుతం కరోనా సోకిన వారికి ధైర్యం, ఆక్సిజన్,డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ ఈ మూడు కల్పిస్తే పేషంట్లు త్వరగా కోలుకునే అవకాశముందన్నారు.

రెమిడెసివిర్ ను ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న కార్పొరేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకునే సమయం కాదన్నారు మంత్రి ఈటల. ఎందుకంటే బెడ్ల కొరతే దీనికి కారణమన్నారు. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలపై చర్యలు తీసుకుని వాటిని..మూసివేయిస్తే ఇంకా ఇబ్బందులు పడే అవకాశముందన్నారు. వారే మానవత్వంతో వ్వవహరించాలని..దీనిపై గతంలో కూడా వారితో చర్చించామన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో టెస్టింగ్ కిట్ల కొరత లేదని..కేసులు మరింతగా పెరిగితే..టెస్టులు జరపకుండానే వారికి ఆస్పత్రుల్లో చికిత్స చేసే అవకాశం కూడా ఉందన్నారు. అంతేకాదు ఏమాత్రం కరోనా లక్షణాలున్నా ఆస్పతులకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మెడిసిన్ కిట్ లోని మందులను వాడాలని సూచించారు. ఆ తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉంటే టెస్టులు చేయించుకోవాల్సిందిగా కోరారు.

కరోనా ట్రీట్మెంట్ ను త్వరలోనే  ఆయుష్మాన్ భారత్ లో లేదా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తామన్నారు మంత్రి ఈటల. నైట్ కర్ఫ్యూను ప్రజలు సీరియస్ గా తీసుకుని ..ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం సంతోషించదగిన విషయమని..వైరస్ తీవ్రత తగ్గేంత వరకు సహకరించాలని కోరారు. సెకండ్ వేవ్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదన్న మంత్రి ఈటల.. ప్రతీ ఒక్కరూ బాధ్యతతో ఉండాలని విజ్ణప్తి చేస్తున్నట్లు తెలిపారు.