
- కార్మిక ఉపాధిశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
అచ్చంపేట, వెలుగు : నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని ఉపాధి కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మంగళవారం హైదరాబాద్లో మంత్రి వివేక్ ను కలిసి నల్లమల్ల ప్రాంత సమస్యలను వివరించారు.
పదర మండలంలోని రాయలగండి ప్రాచీన లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ అభివృద్ధికి కాక గడ్డం వెంకటస్వామి పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే అచ్చంపేట నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో నియోజకవర్గ నాయకులు ఉన్నారు.