గురుకులాల్లో బియ్యాన్ని మారుస్తం

గురుకులాల్లో బియ్యాన్ని మారుస్తం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యమే ఇస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశారు. శనివారం ‘వెలుగు’పేపర్‌‌‌‌లో ప్రచురితమైన ‘‘గురుకులాలకు దొడ్డు బియ్యమే’’కథనంపై మంత్రి గంగుల స్పందించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు కొత్త సన్న బియ్యం ఇవ్వడంతో అన్నం ముద్ద అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారులతో తనిఖీలు చేయించి, ఆ బియ్యాన్ని వెనక్కి తీసుకొని పాత సన్న బియ్యం ఇస్తామని తెలిపారు. ఎంఈవోలు, హాస్టల్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జుల క్వాలిటీ చెక్ రిపోర్టు తర్వాతే గోడౌన్ల నుంచి బియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక స్టూడెంట్ల సంక్షేమం కోసం దాదాపు ప్రతి నెల స్కూళ్లకు 3 వేల మెట్రిక్‌‌‌‌ టన్నులు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు 14 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.