పచ్చని తెలంగాణపై ఆంధ్రోళ్ల కన్ను: గంగుల కమలాకర్ 

పచ్చని తెలంగాణపై ఆంధ్రోళ్ల కన్ను: గంగుల కమలాకర్ 

కరీంనగర్, వెలుగు: నీళ్లు, పంట పొలాలతో పదేళ్లలో పచ్చగా మారిన తెలంగాణపై ఆంధ్రోళ్ల కన్నుపడిందని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ చేతిలోనే ఉండాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  శుక్రవారం కొత్తపల్లి మండలంలోని కమాన్ పూర్, బద్దిపల్లి గ్రామాలతోపాటు కరీంనగర్ సిటీలోని 36, 53, 54 డివిజన్లలో  మంత్రి గంగుల కమలాకర్  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఆయన ఓటు అభ్యర్థించగా తమ ఓటు కారు గుర్తుకే అంటూ ప్రజలు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఓటేసే ముందు సమైక్య పాలనలో కరెంట్ కోసం, సాగునీటి కోసం కష్టపడ్డ రోజులను గుర్తు చేసుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ఓటేస్తే మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనమే వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో పింఛను ఇవ్వలేదని, కొత్తగా పింఛన్ కావాలంటే మరో లబ్ధిదారు చావు కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్  పాలనలో సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని తెలిపారు.  

పచ్చని తెలంగాణ లో చిచ్చుపెట్టాలని తెలంగాణ వ్యతిరేకులు ఒక్కటై  కేసీఆర్ ను ఓడగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్  షర్మిల, కేవీపీతో, బీజేపీ పవన్ కల్యాణ్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో మిలాఖత్ అయ్యారని, వారంతా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అడ్డా వేసి కుట్రలు చేస్తున్నారన్నారు. కర్నాటక ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌దని, వారి మాటలు నమ్మి మన పోరగాళ్ల నోట్లో మట్టి కొట్టొద్దని పిలుపునిచ్చారు.

తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనన్నారు.  కరీంనగర్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటేయాలని.. మరో ఐదేళ్లు సేవకుడిలా పని చేస్తానని కోరారు. సిటీలో రోడ్లు, మురికికాల్వల అభివృద్ధితోపాటు కేబుల్‌‌‌‌‌‌‌‌బ్రిడ్జి, మానేరు రివర్‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌, ఐటీ టవర్‌‌‌‌‌‌‌‌, మెడికల్‌‌‌‌‌‌‌‌ కళాశాల, వేంకటేశ్వర దేవాలయం, ఇస్కాన్‌‌‌‌‌‌‌‌ టెంపుల్‌‌‌‌‌‌‌‌ వంటి ఎన్నో అభివృద్ధి పనులు కొనసాగాలంటే తనను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్‌‌‌‌‌‌‌‌ యాదగిరి సునీల్‌‌‌‌‌‌‌‌రావు, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సిటీ అధ్యక్షుడు హరిశంకర్‌‌‌‌‌‌‌‌, కార్పొరేటర్లు జయశ్రీ -, శ్రీదేవి, షేక్ ఇర్ఫాన్, లీడర్లు, కార్యకర్తలు  పాల్గొన్నారు.